విజయవాడ, జనతా న్యూస్: విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ శుక్రవారం సీఎం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44లక్షల మందికి 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రూ.708.68 కోట్లు వేశామని చెప్పారు. కృష్ణా జిల్లా పాముర్రులో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా దీవెనకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు కడుతుందన్ని అన్నారు. ప్రపంచంలోని నాణ్యమైన విద్యను ఏపీలో అందిస్తున్నామని, అందుకు అవసరమైన ఖర్చును భరిస్తున్నామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
‘విద్యా దీవెన’ కింద రూ.18 వేల కోట్లు జమ: జగన్
- Advertisment -