Roja : చిత్తూరు: పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం జగనన్న చేస్తున్న సాయానికి కృతఙ్ఞతలు అని మంత్రి రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం నెట్టేరి సచివాలయంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష పేదవాడికి అండగా నిలుస్తుందని అన్నారు. సీఎం జగన్ అనుకున్న విధంగా ఇంటింటికి వెళ్లి వైద్య, ఆరోగ్య సిబ్బంది వైద్యసేవలు అందించడం అద్భుత కార్యక్రమం అని అన్నారు. అనంతరం నిండ్ర మండలం నెట్టేరి గ్రామ సచివాలయంలో సుమారు 460 మందిని ఎంపిక చేయగా వారిలో 350 మందికి వైద్య పరీక్షలు చేశారు. కంటివెగులు పథకం కింద 88 మందికి అద్దాలు పంపిణీ చేశారు. ఆయుష్మాన్ హెల్త్ కార్డు లను 71 మందికి పంపిణీ చేశారు.
Roja : ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అద్భతం : రోజా
- Advertisment -