Road Accident: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన రైతులుగా పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలు మిర్చిలోడ్ తో బ్యాడిగి మార్కెట్ కు వెళ్లారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని దావణ గెరి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
- Advertisment -