జగిత్యాల, జనతా న్యూస్: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగిత్యాల అర్భన్ మండలం తిప్పనన్పేట పెద్దపులి వాగు వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ధర్మపురి మండలం రాజారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న భాస్కర్, మహేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో భాస్కర్ రాజారాం గ్రామానికి చెందిన వారు. మహేష్ జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి
- Advertisment -