Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నవదంపతులతో సహా 5గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరి తిరిగి ఇంటికి వస్తుండగా.. నంద్యాల జిల్లా నల్లగట్ల హైవేపై బుధవారం వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. దీంతో రవీందర్ తో పాటు అతని భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29న బాలకిరణ్ తో కావ్యకు వివాహం జరిగింది. వీరు శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతుల సహా 5గురు దుర్మరణం..
- Advertisment -