ముంబై :
బాలీవుడ్ హీరో గోవింద రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. ముంబై లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన మంగళవారం ఉదయం కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్దమౌతుండగా రివాల్వర్ చేజారి కిందపడుతూ కాలిలోకి దూసుక పోయినటు ఓ వార్త సంస్థ తెలిపింది. వెంటనే అతన్ని ముంబైలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడిరచాయి. తన ఆరోగ్యం బాగానే ఉందని, బుల్లెట్ తొలగించారని హీరో గోవింద చెప్పారు. అభిమానులు ప్రార్థనలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల తాను క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
రివాల్వర్ మిస్‌ఫైర్..బాలీవుడ్ హీరో గోవిందకు గాయాలు

- Advertisment -