ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఉపాధి హామీ పనుల పనితీరుపై సోమవారం ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ శేషాద్రి మాట్లాడుతూ కూలీల లక్ష్యాలు చేరుకోవాలని, వేసవి దృష్ట్యా ఉదయం సమయంలోనే పనులు చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచించారు. వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నర్సింల ఎంపీడీవో శ్రీనివాసమూర్తి ఏపీవో చంద్రయ్య, ఈసీ అర్షద్, టెక్నీకల్ అసిస్టెంట్ లు , కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం
- Advertisment -