టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కామారెడ్డికి చేరుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మేరకు ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు గట్టి పోటీ ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే నామినేషన్ చివరి రోజు శుక్రవారం సాయంత్ర 3 గంటల వరకే నామినేషన్ వేసే అవకాశం ఉంది. దీంతో ఆయన కామారెడ్డికి హెలీక్యాప్లర్ లో చేరుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి హెలీక్యాప్టర్ లో వచ్చారు. బీజేపీలోని ఈటల రాజేందర్, బండి సంజయ్ లకు కూడా హెలీ క్యాప్టర్ ను కేటాయించారు. పార్టీ ప్రముఖులు తెలంగాణలో హెలీ క్యాప్టర్లలో తిరగడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్.. హెలీక్యాప్టర్ లో ల్యాండ్ అయిన టీపీసీసీ చీఫ్..
- Advertisment -