- హిందూ ధర్మ రక్షణ సేవా సమితి వ్యస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దోనె అశోక్
కరీంనగర్, జనతాన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హిందూ ఆలయాలపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని హిందూ ధర్మ రక్షణ సేవా సమితి వ్యస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దోనె అశోక్ డిమాండ్ చేశారు. ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ లో ముస్లిం డిక్లరేషన్ కోసం నిధులు ఎలా సేకరిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి హిందూ దేవాలయాలకు చెందిన భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాం అని అనడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ముస్లిం లపైన ప్రేమ ఉంటే వారిని ఆదుకోండి కానీ హిందూ దేవాలయ భూములను వేలం వేయడానికి మీరు ఎవరని ప్రశ్నించాడు. రాజకీయ లబ్ది కోసం హిందువులను చులకనగా చేస్తూ దేవాలయ భూములను వేలం వేస్తామని అంటే హిందూ సమాజం ఊరుకోదు అని హెచ్చరించారు. గతంలో కూడా హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుంది అని అన్నారు.. ఇప్పటికైనా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే రానున్న రోజులలో పార్టీకి హిందూ సమాజం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.