Result:గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. గురుకులాల్లో మొత్తం 2,717 పోస్టులకు గత ఏడాది నియామక బోర్డు పరీక్షలు నిర్వహించింది. జూనియర్ కళాశాలలో 1,924, డిగ్రీ కళాశాలలో 793 లెక్చరర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించింది. ఈ తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను ఆదివారం వెల్లడించనుంది.
Result: నేడు గురుకుల జేఎల్ ఫలితాల విడుదల
- Advertisment -