ఈడీ కేసులున్న నేతలు రారు
కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలకు కృషి నిధులు
కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి
హైకమాండ్ పరిధిలో అధ్యక్ష మార్పు
మీడియా ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
ఇతర పార్టీల ప్రజా ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే, రాజీనామా చేయాల్సిందే నని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్షష్టం చేశారు. కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీ లోకి వచ్చే అవకాశాలు లేవన్న ఆయన.. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే తమ పార్టీలో చేరాలన్నారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
రామాయన్ సర్క్యుట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తానని, కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పనులు పూర్తయ్యాయన్నారు. కేసీఆర్ సర్కారులో నన్చుతూ వచ్చిన విభజన చట్టాల అంశాలు..ప్రస్తుత కొత్త ప్రభుత్వాల ద్వారా పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష ఎంపిక పార్టీ అదిష్టానం చూసుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదని.. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించిందని తెలిపారు. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందన్నారు.
