Friday, September 12, 2025

ప్రైవసీ దెబ్బతీయకుండా రీసెర్చ్ చేయాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: వినియోగదారుల డేటా ప్రైవసీకి దెబ్బతీయకుండా పరిశోధన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ),  వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ ప్రాస్ట్రక్చర్   వంటి వాటి గురించి చర్చించారు . డిజిటల్ రంగంలో భారత్ తీసుకు వచ్చిన మార్పులను బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. భారతీయులు టెక్నాలజీని అతివేగంగా నేర్చుకున్నారని ఆయన అన్నారు. సాంకేతిక రంగంలో భారత వేగంగా దూసుకెళ్తుందని తెలిపారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీతో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. డేటా వినియోగం గురించి  ప్రధాని మాట్లాడుతూ ప్రైవసీ దెబ్బతీయకుండా  వినియోగించాలన్నారు. రీసెర్చ్ డేటా వాడుకునే సమయంలో డేటా యాజమాన్యానికి ఈ విషయం తెలియాలన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page