ఇల్లంతకుంట, జనతాన్యూస్: ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ సిద్దోగం కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రేపాక గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న ఎల్లమ్మ సిద్ధోగం ఉత్సవానికి మంగళవారం ఎమ్మెల్యే హాజరై మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాల ద్వారా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రమణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ,వినయ్ కుమార్, పసుల వెంకన్న, మల్లేశం, లక్ష్మణ్, మొగిలోజు సాగర్, కామల్ల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువకులు పాల్గొన్నారు.
రేపాక ఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్న ఎమ్మెల్యే
- Advertisment -