కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ ద్వారా కేవైసీ వివరాల ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం చేయాలని సెబీ నిర్ణయించుకుంది. కొత్త విధానంలో శాశ్వత ఖాతా (పాన్) సంఖ్య, పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఆదాయపు పన్ను విభాగం డేటా బేస్, డిజి లాకర్, ఎం ఆధార్ వంటి అధికారిక డేటా బేస్ ఆధారంగా కేఆర్ఏలు ధ్రువీకరిస్తాయి. అధికారిక డేటా ఆఫీస్ ప్రకారం కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నట్లు తెలిస్తేనే వాటిని ధృవీకరించిన వివరాలుగా పరిగణిస్తారని సిగ్నస్ జి సహా వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ రతన్ తెలిపారు. డిజిటల్ పద్ధతిలో గుర్తింపు పత్రాల పరిశీలన విషయంలో చాలా మంది ముదుపరులు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త విధానం పరిష్కారం చూపుట అవకాశం ఉందని తెలిపారు.
ఇక కేవైసీ వివరాల నమోదు సులభతరం..!
- Advertisment -