కాంగ్రెస్ నేత వెలిచాల మరో కార్యక్రమం
నగరంలో మార్నింగ్ వాక్..మేయర్‌పై తీవ్ర ఆరోపలు
సునిల్ రావు మరో ఆనకొండ అని వ్యాఖ్య
కరీంనగర్ -జనత న్యూస్
కరీంనగర్లో రిఫ్రమ్ కార్పోరేషన్`క్లీన్ ఆఫ్ కార్పోరేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు కాగ్రెస్ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరం అవినీతి మయంగా మారిందని..ఇక్కడ అవినీతి ఆనకొండలున్నారని ఆరోపించారు. సునిల్ రావు పెద్ద ఆనకొండ అని ఇక్కడ ఎవరడిగినా చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పోరేషన్లో అవినీతి పెరిగి పోయిందని ప్రజలు కోడై కూస్తున్నారని, మేయర్ సునిల్ రావును ఉద్దేశించి ఆరోపనలు చేశారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకో డివిజన్ చొప్పున తిరుగుతూ..ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలపారు. బస్టాండ్, మున్సిపల్ కార్పోరేషన్, అంబేద్కర్ స్టేడియం, ఎస్ఆర్ఆర్ కాలేజీ..ఇలా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అంతకు ముందు ఉదయం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులతో కలసి మార్నింగ్ వాక్ చేశారు వెలిచాల. వాకర్స్, క్రీడాకారులను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. స్టేడియంలో బాత్ రూంలు లేవని కొందరు వెలిచాల దృష్టికి తీసుక రాగా..తాను సొంతంగా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్ తదితరులున్నా
‘రిఫ్రం కార్పోరేషన్-క్లీన్ కార్పోరేషన్’
- Advertisment -