సిద్దిపేట, జనతా న్యూస్:సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడిస్) గరిమా అగ్రవాల్ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కరించుకొవడానికి అర్జిదారులు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కి అర్జి పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమం. సామాన్యులకు అందుబాటులో ఉండి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకొవడానికి ఓక చక్కని వేదిక ఈ ప్రజావాణి. సమస్యలు పట్టుకుని ఎంతో నమ్మకం తో కార్యాలయం కి వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా పని చేయ్యాలని జిల్లా అధికారులకు తెలిపారు. అలాగే ప్రతి సోమవారం తప్పనిసరిగా జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హజరు కావాలి. భూ సంబంధిత, ఆసరా పింఛన్లు ఇతరత్రా మొత్తం కలిపి 16 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ, డిఆర్డిఎ పిడి జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.