RC 16: మెగా హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో క్రేజీ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. RC 16 గా నామకకరణం చేసుకున్న ఈ మూవీ గురించి ఈమధ్య అప్డేట్స్ ఒకటి వెంట ఒకటి వస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఈ మూవీ నుంచి రావడంతో సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ నటించే అవకాశం ఉంది. ఇందులో ఆయన రామ్ చరణ్ తాతగా కనిపించనున్నారట. ఇప్పటికే ఆర్ సి 16కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనుండడంతో సినిమాకు హైపెక్కించింది. తాజాగా బిగ్ బి నటిస్తున్నాడని తెలియడంతో ఈ మూవీపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఆర్ సి 16 మూవీ రా అండ్ ఫస్ట్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు రికార్డింగ్ కూడా జరిగిందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని చిత్రం యూనిట్ తెలుపుతుంది.
RC 16: రామ్ చరణ్ తాతగా అమితాబ్ బచ్చన్..
- Advertisment -