Thursday, March 12, 2026

అడ్మిన్ అడిషనల్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన రవి

వరంగల్, జనతా న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ అదనపు డీసీపీ గా ఎన్. రవి సోమవారం భాద్యతలు చేపట్టారు. జోగులాంబ గద్వాల్ అడిషనల్ గా విధులు నిర్వహిస్తున్న అదనపు డీసీపీ రవి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ గా బాధ్యతలు స్వీకరీంచారు. 1991 పోలీస్ విభాగంలో చేరి ఎస్. ఐ, సి. ఐ గా మెదక్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించగా, డి ఎస్ పి గా సంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పనిచేసారు. గత ఏడాది అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు.సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ గా బాధ్యతలు చేపట్టిన రవి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు,

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page