రైతు రుణ మాఫీపై ఆరా..
ఉచిత బస్సు, విద్యుత్ ఛార్జీల మాఫీపై..
రైతులు, కూలీల సంతోషం
సైదాపూర్-జనత న్యూస్
వ్యవసాయ పొలంలో రైతులు, కూలీలతో ముచ్చటించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నుండి సైదాపూర్‌కు వెళ్తుండగా మార్గ మధ్య పొలాల్లో వరినాట్లు వేస్తూ కనిపించిన మహిళలను చూసి వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లిన మంత్రి పొన్నం..పలు అంశాలపై ఆరా తీశారు. రైతు రుణమాఫీ ఎంత మందికి అయిందని ప్రశ్నించగా..తమ కందరికీ మాఫీ అయిందని సమాదానం చెప్పారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని, వేరే గ్రామాలకు కూడా పనుల నిమిత్తం పోతున్నామని సరోజ అనే మహిళా రైతు సంతోషం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందని గతం నుండి కరెంట్ బిల్లులు చెల్లించేదని, దీంతో డబ్బులు ఆదా అవుతున్నాయని పలువురు రైతులు మంత్రి ఎదుట వెల్లడిరచారు. తమకు రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు మహిళలు కోరగా..త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయంలో లాభార్జన వచ్చే పంటలు కూడా వేయాలని, అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం వస్తుందని రైతులకు మంత్రి సూచించారు.