Thursday, September 11, 2025

కరీంనగర్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్

కరీంనగర్, జనతాన్యూస్:ఫెమిలైజేషన్ ఎక్ససైజ్ లో భాగంగా కరీంనగర్ కు విచ్చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో శుక్రవారం నాడు కరీంనగర్ టౌన్ డివిజన్ లోని గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చినందు ఆర్ ఏ ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ గీతాభవన్ నుండి గోదాం గడ్డ , కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వరకు తరువాత కిసాన్ నగర్ , హుస్సేనిపుర ప్రాంతాల్లో కొనసాగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ కమాండెంట్ బిస్వ రంజన్ సాహు అడిషనల్ డీసీపీ సి రాజు, ఏసీపీ నరేందర్,, ఇన్స్పెక్టర్ లు రవీంద్ర రోషన్ (ఆర్. ఏ. ఎఫ్) లలితగోప్ నారాయణ్ (ఆర్ . ఏ. ఎఫ్) , వెంకటేష్ , శ్రీనివాస్ , సురేష్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page