Rao Ramesh: విలక్షల నటుడు రావుగోపాల్ రావు కుమారుడు రావు రమేష్ ప్రత్యేకత నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడవు. అయితే ఇంతవరకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించాడు. కానీ ఇప్పడు హీరోగా అలరించనున్నాడు. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమాతో రావు రమేష్ కొత్తగా కనిపించనున్నాడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. బుజ్జి రాముడు పెంట్యాల, మోహన్ నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా సరికొత్త రీతిలో మంగళవారం ఈ సినిమా పోస్టులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటివరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారని అన్నారు. సినిమా స్టార్టింగ్ మంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, పూర్తి స్థాయి వినోదంతో పాటు ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని వారు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టరు ఎవరైనా ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్న నటుడిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకుల ఆవిష్కరిస్తే బాగుంటుందని మేమంతా మనస్పూర్తిగా నమ్ముతున్నామని రావు రమేష్ అన్నారు.
హీరోగా రావు రమేష్.. ఫస్ట్ లుక్ రిలీజ్
- Advertisment -