ఇల్లంతకుంట జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ చైర్మన్ గా చొప్పరి రామచంద్రం ఎన్నికయ్యారు. సోమవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో ఇల్లంతకుంట మండల అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి రామచంద్రం మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారుల సమస్యల గురించి నా వంతు కృషి చేస్తానని ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ సభ్యులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ చైర్మన్ గా రామచంద్రం విజయం
- Advertisment -