సమయా వేళ లపై భిన్నాభిప్రాయాలు
పండితుల ముహుర్తాలపై సందేహాలు
కరీంనగర్-జనత న్యూస్
అన్నా-చెళ్లి..అక్కా -తమ్ముడు..ఇలా సోదర భావానికి ప్రతీక రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి). ఆగస్టు 19 సోమవారంన రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. అయితే..ఎక్కువ మంది మంచి ముహుర్తం చూసుకుని రాఖీ కట్టించుకోవడం ఆనవాయితీ. గత పండుగలు ఎలా ఉన్నా..ఈ రాఖీ పౌర్ణమి రోజున మంచి ముహుర్తం (టైమ్) ఎప్పుడనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పండితులు వివిధ సమయా వేళలు సూచిస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ రోజు భద్రా కాలం ఉంటుందని..చెడు ప్రభావం చూపిస్తుందని కొందరు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.32 నుండి సాయంత్రం 6.25 గంటల వరకు వేడుక జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తే..సాయంత్రం 6.25 నుంచి 7.40 వరకు రక్షాబంధన్ జరుపుకోవడం ఉత్తమ మని మరికొందరు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు..మళ్లీ మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం వరకూ అంతా శుభ సమయమే నని ఇంకొందరు అర్చకులు చెబుతున్నారు. పండితులు తలోమాట చెప్పడం, సోషల్ మీడియాలో ఇలా వైరల్ కావడంతో రాఖీ ఎప్పుడు కట్టుకోవడమనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ముహుర్తాలు ఏమీ చూసుకోకుండా..ఆది, సోమ వారాల్లో వీలును బట్టి రాఖీ కడుతున్నారు. రాఖీ కట్టుకోవడం ఓ సెంటిమెంట్..దీనిపై పండితుల్లో బేదాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయం ఉంటే బాగుండని ప్రజలు కోరుకోరుతున్నారు.
రక్షా బంధన్ (ముహుర్తం) ఎప్పుడు ?
- Advertisment -