వేములవాడ, జనత న్యూస్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని వేములవాడలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడెమొక్కులను తీర్చుకున్నారు. అనంతరం ప్రధానికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక మెమొంటోతో సత్కరించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ, వరంగల్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.
రాజన్న సిరిసిల్ల: వేములవాడలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
- Advertisment -