ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను డి ఆర్ డి ఓ శేషాద్రి అందజేశారు బుధవారం ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఖండిత కందకాల పనులను పరిశీలించి , కూలీలతో కూలీ గిట్టుబాటు, కొలతలు, చెల్లింపులపై కూలీలతో చర్చించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడి నర్సింహులు, ఏ పి ఓ చంద్రయ్య , టెక్నీకల్ అసిస్టెంట్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి ముక్తర్ అహ్మద్ , ఫిల్డ్ అసిస్టెంట్ కనుకయ్య , మేట్లు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల: ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు
- Advertisment -