Raj Kundra : బాలీవుడ్ స్టార్ నటి శిల్పశెట్టి భర్త సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆయన ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టుపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇందులో ఆయన ‘వి సపరేటేడ్’ అనే మెసెజ్ పెట్టాడు. అంటే శిల్పాశెట్టితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు అర్థం వచ్చేలా పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజ్ కుంద్రా నటించిన ‘యూటీ 69’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా తన ఎక్స్ ఖాతాలో ‘ఈ కష్టకాలంలో మేం దూరం కాబోతున్నాం. మాకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నాం’ అని మెసేజ్ పెట్టారు. ఫోర్న్ గ్రఫీ కేసులో గతేడాది నవంబర్ లో అరెస్ట్ అయినా రాజ్ కుంద్రా ఆ తరువాత బెయిల్ పై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత అతడు ఎక్కువగా మీడియా ఎదుట కనిపించడం లేదు. మరోవైపు భర్త విషయంలో శిల్పాశెట్టి ఎటూ తేల్చుకోకపోతున్న తరుణంలో భర్త రాజ్ కుంద్ర ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Raj Kundra : శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా విడిపోతున్నారా?
- Advertisment -