కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసింది. ప్రజా విజయభేరి యాత్రలో భాగంగా ఆయన పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం ఆయన మేడిగడ్డ లో పర్యటించనున్నారు. ఇక్కడున్న లక్ష్మీ బ్యారేజిని పరిశీలించనున్నారు. కొన్ని రోజుల కిందట ఈ బ్యారెజ్ లోని ఓ పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర బృందం పర్యటించి కుంగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీపీసీసీ నేతలు లక్ష్మీ బ్యారేజీని సందర్శించాల్సిందిగా కోరారు. దీంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకోగా వారే ఓకే చెప్పారు.
ముందుగా రాహుల్ ప్రత్యేక హెలీక్యాప్టర్ లో మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లికి చేరుకుంటారు. ఆ తరువాత లక్ష్మీ బ్యారేజిని సందర్శిస్తారు. అనంతరం మహిళా సదస్సులో పాల్గొంటారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు.కాగా రాహుల్ పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లక్ష్మీ బ్యారేజ్ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే అక్కడికి వెళ్లాక పోలీసులు ఏ విధంగా నడుచుకుంటారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.