Rahul Gandhi: మంథని, జనతా న్యూస్ : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ లో బుధవారం పర్యటించారు. ఇక్కడున్న లక్ష్మీ బ్యారేజిని పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టులో కుంగిన ఫిల్లర్ ను అయన పరిశీలించారు. కొంతకాలం కిందట బ్యారేజి పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాహుల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును పరిశీలించాలని టీపీసీసీ నేతలు కోరగా ఆయన ఓకే చెప్పారు. లక్ష్మీ బ్యారేజిని పరిశీలించిన తరువాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లిలో రాహుల్ పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకొని తెలంగాణ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నట్లు తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్ ను రూ500కే ఇస్తామని భరోసా ఇచ్చారు.
Rahul Gandhi: ప్రతి మహిళకు నెలకు రూ.2500 : రాహుల్ గాంధీ
- Advertisment -