Rahul Gandhi In Telangana : హైదరాబాద్, జనతా న్యూస్ :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే రెండు విడుతలుగా ప్రచారం చేసిన రాహుల్ నవంబర్ 17న మరోసారి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ను టీపీసీసీ రూపొందిస్తోంది. రాహుల్ గాంధీ ఈసారి వరంగల్, పాలకుర్తి, భువనగిరి సభల్లో పాల్గొంటారు. నవంబర్ 15న అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఖరారు అవుతుంది. ఆ తరువాత ప్రచారం హోరెత్తించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు జరిపిన రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో మరోసారి రాష్ట్రానికి రప్పించి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. కాగా ఈసారి రాహుల్ గాంధీ వారం రోజుల పాటు పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Rahul Gandhi: మరోసారి తెలంగాణకు రాహుల్ గాంధీ..
- Advertisment -