Rahul Gandhi :హైదరాబాద్, జనతా న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన ప్రజా భేరి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని, దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు నిలిచిపోతుందని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని అన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు చెల్లిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏడాది కాకుండానే బ్యారేజీలు కూలిపోతున్నాయన్నారు. గతంలోకాంగ్రెస్ ఎన్నో సంచలనాత్మక ప్రాజెక్టులను కట్టిందన్నారు.
Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి : కొల్లాపూర్ లో హుల్ గాంధీ
- Advertisment -