Rahul gandhi :పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలతో కాంగ్రెస్ కు దశాబ్దాలుగా అనుబంధం ఉందని, నెహ్రు, ఇందిర, సోనియా గాంధీల నుంచి ప్రజలతో మాకు సంబంధం ఉందని ఆయన అన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఆయన ప్రజలను నేరుగా కలుసుకున్నారు. చిరు వ్యాపారి వద్ద దోశ వేశారు. ఆ తరువాత ఓ కుటుంబంతో కలిసి మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో ఓబీసీలు ఎంత ఉన్నారు? వారికి ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తున్నారు? అనే విషయాలను కేసీఆర్ ఎందుకు చెప్పరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చక్కెర ఫ్యాక్టరీనితెరుస్తామన్నారు.
Rahul gandhi : పసుపురైతులకు గిట్టుబాటు ధర: రాహుల్ గాంధీ
- Advertisment -