-
ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణకు దిగాడంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణ
-
కాంగ్రెస్ అభివృద్ధిని ప్రశ్నించిన రసమయి
-
రసమయి దిష్టిబొమ్మ దహనం చేసిన బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలు.
జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెజ్జంకి మండలం బేగంపేటలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే , బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే రసమయి బాలకిషన్ స్థానిక ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి భర్త పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణ చేశాడని దీంతో భారీ ఎత్తున ప్రచార స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రసమయికి వ్యతిరేకంగా నినదించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలపైకి దూసుకు రావడంతో తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగిన, రసమయి కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం భారీ ఎత్తున గుమిగోడిన కాంగ్రెస్ శ్రేణులు రసమయికి వ్యతిరేకంగా నినాదిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ భర్త పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే అసహనానికి లోనై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని ఎమ్మెల్యే పై మండిపడ్డాడు నవంబర్ 30న బేగంపేట ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నావు? కాంగ్రెస్ ఏం చేసిందో నీ పక్కన ఉన్న లీడర్లను అడుగు అని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండ అమరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పత్తి మహేందర్ రెడ్డి, కొరివి లక్ష్మణ్, శీలం నర్సయ్య, బుర్ర రవి, బుర్ర తిరుపతి, వెన్నం రాజు, రాజు మహేందర్, నూనె రాజేందర్, తిరుపతి, రాజేందర్, శ్రీ రామోజీ కిషన్, శ్రీ రామోజీ సాత్మారా, ఎలా హరీష్, బన్నీ, చందు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.