- రమణీయం.. రాధాకృష్ణ రథోత్సవం..
- ముగిసిన రాచర్ల గొల్లపల్లి గీతా మందిరం వార్షికోత్సవాలు
- వెల్లివెరిసిన ఆధ్యాత్మికత
- తరలివచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలు, భక్తులు
సిరిసిల్ల, జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గీతా మందిరం వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజాకాచార్యులు, శ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామివారి అనుగ్ర భాషణం, ఉదయం 9 గంటలకు కుంభాభిషేకం, మధ్యహ్నం ఒంటి గంటకు ప్రముఖ పారిశ్రామిక వేత్త కోట సతీష్ కుమార్, రజనీ దంపతుల ఆధ్వర్యంలో రాధాకృష్ణ స్వామి కల్యాణం నిర్వహించారు. అనంతరం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాటం ఆకట్టుకుంది.
కుంభాభిషేకంలో భాగంగా వెయ్య కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజాకాచార్యులు, శ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి ప్రవచనం ఆకట్టుకుంది. అలాగే సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త కోట సతీష్ కుమార్ , మార్పు నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి , కొండా నర్సయ్య , పి. రామచంద్రం, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సత్యనారాయణ స్వామి, ప్రముఖ వ్యాపార వేత్త దుబ్బ విశ్వనాథంలు తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతా మందిరం వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ప్రముఖ వ్యాపార వేత్త కోట సతీష్, రజనీ దంపతులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్నాం
రాచర్ల రఘురామ శర్మ
1990లో శ్రీ గీతా సేవా సమితి ఆధ్వర్యంలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఏర్పడిన గీతా మందిరంను నిర్మించి ఈ ఏడాదికి 24 సంవత్సాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రజతోత్సవాన్ని నిర్వహించాం. ఈ ఉత్సవాల్ల భాగంగా ఈసారి మహా కుంభాభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ప్రతిష్ట ప్రత్యేకంగా నిర్వహించాం. ఇప్పటి వరకు 200 గ్రామాల్లో అనేక శాఖలు ఏర్పాటు చేసి భగవద్గీత గురించి ప్రచారం చేస్తున్నాం. ప్రజల్లో భక్తి భావం కలిగించేలా ప్రవచనాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ఇప్పటి వరకు సొంత ఖర్చులతోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తాం.