రాజ్యసభ స్థానం ఖాళీ అయిందని బులిటెన్
బీజేపీలో చేరుతారా..తటస్థంగా ఉంటారా..?
ఢిల్లీ:
బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య రాజీమానాను ఆమోదించారు రాజ్యసభ ఛైర్మన్. నిన్న ఆయన రాజీనామా సమర్పించగా..నేడు ఆమోదించి రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు ఛైర్మన్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యను 2022లో అప్పటి వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపారు. ఎన్నికల ముందు వరకు వైసీపీతో భాగానే ఉన్న కృష్ణయ్య..ఘోర ఓటమి తరువాత దూరం దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు రాజీనామా సమర్పించడం, ఆమోదించడం జరిగింది. అయితే..ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా, లేక తటస్తంగా ఉంటారా..అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన గతంలో సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్నారు. ఏసీ సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత పరిణామ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి కొద్ది కాలం తటస్థంగా ఉన్నారు. వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేయడంతో టీడీపీ పార్టీపై పలు విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆయన స్టాండ్ ఎలా ఉంటుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆర్ కృష్ణయ్య రాజీనామా ఆమోదం

- Advertisment -