న్యూఢిల్లీ: 2024 ఏడాదిలో పారిస్ వేదికగా ఒలంపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఇందులో భాగంగా భారత్ కు చెందిన 4×400 మీటర్ల మహిళల, పురుషుల జట్లు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాయి. సోమవారం బహామాస్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలేస్ లో భారత పురుషుల, మహిళల టజట్లు రెండో రౌండ్ హీట్స్ లో రెండో స్థానంలో నిలిచాయి. పురుషుల విభాగంలో మహ్మద్ అనాస్ యహియా, మహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకట్ బృందం రెండో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో రూపల్ చౌదరి, ఎంఆర్ పూనమ్మ, జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేషన్ లు అర్హత సాధించారు. ఒలంపిక్స్ క్రీలు జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరగనున్నాయి.
ఒలంపిక్స్ క్రీడలకు భారత జట్ల అర్హత
- Advertisment -