PV Narasimaha Rao : హైదరాబార్, జనతా న్యూస్: భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును మరోసారి ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ లకు ఇవ్వగా మరో భారతరత్నను మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్ లకు ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపింది. పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు పదవుల్లో కొనసాగారు. 1971 నుంచి 1973 వరకు సీఎంగా పనిచేశారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో హోం మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానికి ఎన్నికైన తొలి ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింమారావు మాత్రమే. ఆయన పదవిలో ఉన్నంతకాలం అనేక సంక్కరణలు చేపట్టారు. ఆయన పదవీ చేపట్టిన నాటికి పరిస్థితులు అందోళనకరంగా ఉన్నాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి 3 శాతం మాత్రమే ఉండేది. 1991లో నంద్యాల నుంచి పోటీ చేసిన 5 లక్షల మెజారిటీ రావడంతో గిన్నిస్ రికార్డు కొట్టారు. పీవీ నరసింహారావే 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, హిందీలో కవితలు రాయడం ఆయన హాబీ. మాజీ ప్రధానికి పదవీరావడం సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన పనితీరుకు నిదర్శనం అని కొనియాడుతున్నారు.