బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని, జనతా న్యూస్ : తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌పార్టీ ప్రభుత్వంతోపాటుతాను సొంతంగా ఈ సమాజానికి ఎంతో చేసినా తననే ప్రశ్నిస్తున్నారే కానీ ఏమీ పని చేయనోళ్లను ఇలా ప్రశ్నించిఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్లమని మీ బహుజనవాదం ఏమైందని రాజకీయంగా ఎదగనీయకుండా కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు
మంథని పట్టణంలోని రాజగృహ లో మంథని నియోజకవర్గంలోని కాటారం మహముత్తారం మహదేవ పూర్ మండలాలకు చెందిన యువకులు సుమారు 100 మంది భీఆర్ఎస్ పార్టీ లో చేరగా వారికి మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏండ్లు ఓట్లు వేసి గెలిపిస్తే అనేక పదవులు పొంది ఈ ప్రాంతానికి, ప్రజలకు ఏమీ చేయలేదని, నాటి నుంచి నేటి వరకు ఏమీ చేయకుండా మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు.అలాంటి వారి గురించి ఆలోచన చేయాలని, తాము ఇంత చేసినా పెద్ద మనుషులు సైతం అర్థం చేసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు అధికారంలో ఉన్నోళ్లు ఎవరేం చేశారనే విషయంపై ప్రజల్లో చర్చ పెట్టాలని, చర్చించడం ద్వారానే వాస్తవ విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. తాను పార్టీతో పాటు తన సొంతంగా ఈ ప్రాంతప్రజలకు అనేక సేవలు అందించామని ఆయన గుర్తు చేశారు.
ఈనాడు ఓ ఎంపీపీని, ఎంపీటీసీలను పార్టీలోకి తీసుకుని మీ బహుజనవాదం ఏమైందని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇంత పెద్ద సమాజం కోసం బహుజనవాదం ఎత్తుకుని ముందుకు అడుగులు వేస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు గొప్పగా ఆలోచన చేసి అండగా నిలువాల్సిన అవసరం ఉందని అన్నారు. మంథనిలాంటి ప్రాంతంలో పేదవర్గాలు రాజకీయంగా ఎదిగనియ్యకుండా కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే ఎంతో మంది నాయకులను రాజకీయంగా అణిచివేసిన సందర్బాలు ఉన్నాయన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను సైతం రాజకీయంగా ఎదుగుతుంటే అనేక కుట్రలు,కుతంత్రాలతో రాజకీయ సమాధి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వివరించారు. గ్రామీణప్రాంతాల్లో యువత గొప్పగా ఆలోచించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు