Saturday, July 5, 2025

Pushpa 2 The Rule: ఊగిపోతున్న బన్నీ ఫ్యాన్స్..

Pushpa 2 The Rule:  ‘పుష్ప ది రైజ్‌’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకున్న ఐకాన్ స్టార్ ‘పుష్ప:2 ది రూల్‌’ తో అలరించడానికి రెడీ అవుతున్నారు.  బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, బన్నీ   కలయికలో రాబోతున్న పుష్ప`2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. ఏప్రిల్‌ 8, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.  ఈ టీజర్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్‌ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్‌ అవతార్‌లో కనిపించి.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు.

గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్‌ కట్‌ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ ఇందులో చీరకట్టి.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే.. ‘పుష్ప2: ద రూల్‌’ నీయవ్వ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ లుక్‌, యాటిట్యూడ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. ప్రపంచ సినీ ప్రేక్షకులంతా మరోసారి పుష్పరాజ్‌ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పార్ట్‌ 2లో అల్లు అర్జున్‌ విశ్వరూపం చూడబోతున్నారనేది ఈ టీజర్‌తో మరోసారి సుస్పష్టమైంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page