Saturday, July 5, 2025

ఆలయాల్లో శుద్ధి.. ప్రత్యేక పూజలు.. వీడిన చంద్రగ్రహణం..

శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసిన ఆలయాలు ఆదివారం ఉదయం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు ప్రధాన ద్వారం తెరిచారు. ఆ తరువా పుణ్యాహవచనం, శుద్ధి చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ నిర్వహించిన తరువాత ఉదయం 6 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం రాత్రి 1.05 గంటల కు ప్రారంభమైంది. ఆ తరువాత రాత్రి 2.22 గంటలకు వీడింది. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలతో పాటు ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆ తరువాత తలస్నానం చేశారు. ఏపీలోని విశాఖలో చంద్రహణం ను కొందరు కెమెరాలో బంధించారు.

lunar eclipse in vishaka
lunar eclipse in vishaka
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page