సిద్దిపేట ,జనతా న్యూస్: మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే, ఉన్నదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో కలెక్టరేట్ లో సెల్ఫ్ ఆటోమేటిక్ బీపీ చెకప్ మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో బీపీ చెక్ అప్ మిషన్ ను డిఎం అండ్ హెచ్ఓ కాశీనాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.చాలా మంది తాము బీపీతో బాధ పడుతున్నట్లు తెలియక సడన్ కార్డియాటిక్ స్ట్రోక్ వచ్చి ఆకస్మిక మృత్యువాత పడుతున్నారని,రక్తపోటు-బీపీ పరీక్ష చేయడంతో బిపి ఉంటే డాక్టర్ల సాయంతో మందులను వాడి మీ ఆరోగ్యాన్ని, మీరే పరిరక్షించుకోవచ్చని కార్యలయ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని, దీనికి ఎవరి సాయం అవసరం లేదని, మీరే స్వయంగా చెక్ పరీక్ష చేసుకోవచ్చునని అవగాహన కల్పించారు.
మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది : సిద్దిపేట కలెక్టర్
- Advertisment -