Friday, March 13, 2026

స్మార్ట్ సిటి పనుల్లో పురోగతి కనబరచాలి

  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

కరీంనగర్, జనతా న్యూస్:నగర అభివృద్ధిలో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులలో పురోగతిని కనబరచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తెలిపారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనుల ప్రగతిపై మున్సిపల్ అధికారులతో అయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ సిటి లో భాగంగా ఇదివరకే ప్రారంభించిన పనుల్లో పురోగతిలో ఉన్నవి, టెండర్ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభ దశలో ఉన్న వాటి వివరాల జాబితాను రూపొందించి అందించాలని సూచించారు. పనుల్లో ఆలస్యం కాకుండా ఉండాలని, గుత్తేదారులు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులను ఆలస్యం చేసినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మరోకరితో పనులను పూర్తి చేయించాలని తెలిపారు. చివరి దశకు చేరుకున్న వాటిని త్వరగా పూర్తిచేయాలని, అదేవిధంగా ప్రాధాన్యతను బట్టి పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. ఎస్టిమేషన్, మెజర్ మెంట్ లలో పొరపాట్లు జరగకుండా అధికారులు పరిశీలించి దృవీకరించాలని, ఎదైన పొరపాట్లు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page