Priyamani Bhamakalapam 2: గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పుడు వెబ్ సిరీస్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన భామ కలాపం ఓటిటి వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా ’భామ కలాపం 2‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
భామ కలాపం 2 కథ విషయానికి వస్తే.. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుపమ(ప్రియమణి) అనే అమ్మాయి వంటలు చేస్తూ ఉంటుంది. కోల్ కతా మ్యూజియంలో 200 కోట్ల విలువైన కోడి గుడ్డు మాయం అవడంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అయితే ఈ స్టోరీ పార్ట్ వన్ లో చూపించారు. ఇప్పుడు ఆ కష్టాల నుంచి తప్పించుకొని ఆమె కుటుంబం ఇల్లు మారుతుంది. ఇక్కడి నుంచి పార్టీ టు లో ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్ ను ప్రారంభిస్తుంది. పనిమనిషి నీ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటుంది. ఇకపై సాఫీగా తన జీవితంలో మరో మలుపు తిరుగుతుంది. దాని పరిష్కారం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారుడిని సంప్రదించగా ఆయన ఓకే అంటాడు. కానీ తర్వాత ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి తెలుసుకోమంటారు. అయితే ఆయన అలా మారడానికి ఒక కారణం ఉంది దానిపై గురించి తెలవాలంటే తెరపై చూడాల్సిందే.