న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం యుద్ధవిమానంలోప్రయాణించారు. స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన తేలికపాటి ‘తేజస్’ లో ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తేజస్ లో ప్రయాణించిన అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంతో స్వదేశీ సామర్థ్యంపై మరింత విశ్వాసం పెరిగింది అని అన్నారు. అలాగే దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం పెరిగింది అన్నారు. ప్రపంచంలో భారత్ ఏ విషయంతో తక్కువ లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తేజస్ లో ప్రయాణించిన ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
యుద్ధవిమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ
- Advertisment -