India President : సాధారణంగా రాష్ట్రపతిని కలుసుకోవడం అంటే మాములు విషయం కాదు. అరుదైన ఘనత సాధిస్తే తప్ప నేరుగా కలుసుకోలేం. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాధారణ ప్రయాణికులయ్యారు. దేశ రాజధాని ఢిల్లోలోని మెట్రో రైలులో ఆమె విద్యార్థులకు కలిసి ప్రయాణించారు. మెట్రో రైల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయంపై వారిని అడిగారు. రాష్ట్రపతి రైలులో ప్రయాణించడంపై అక్కడున్న వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె తో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ ఉన్నారు. అమృత్ ఉద్యాన్ అనే కార్యక్రమానికి ఆమె ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రాష్ట్ర పతి అందుబాటులో ఉండనున్నారు. ఇందులో భాగంగా ఆమె బుధవారం రాష్ట్రపతి భవన్ సమీపంలోని సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ ను సందర్శించి రైలులో ప్రయాణించారు.
India President : విద్యార్థులకు కలిసి మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి
- Advertisment -