ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కళ్యాణ లక్ష్మి ,సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
గన్నేరువరం-జనత న్యూస్
ప్రజా సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం రైతు వేదిక లో గురువారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, 19 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కొంతమందికి రుణమాఫీ అందడానికి కొంత సమయం పడుతుందని, రైతులు దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. గత పాలకులు 10 సంవత్సరాలలో చేయని రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది నెలల్లోని చేసి చూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఇప్ప నరేందర్, ఏవో కిరణ్ మై, యువజన కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూసుకు ఉపేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, వో డ్నాల నరసయ్య, నేలపట్ల కనకయ్య, నల్ల చంద్రారెడ్డి, బొడ్డు సునీల్,దుడ్డు మల్లేశం, మైసమ్మ పెళ్లి తిరుపతి, వరల మల్లేశం, బండి రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్కురి అనంతరెడ్డి, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం

- Advertisment -