కరీంనగర్-జనత న్యూస్
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ మంకమ్మతోట జిల్లా గ్రంథాలయం ఎదుట ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..11 వేల పోస్టులతో డీఎస్‌సీ నోటిఫికేషన్ వేశారని, ఇవి ఏ మాత్రం సరిపోవని, 25 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్ -2, 3 ఖాళీలను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ఇప్పటికే తాము వయో పరిమితి కోల్పోతున్నామని, పోస్టులు పెంచకుంటే నిరుద్యోగులుగానే మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.