జనతన్యూస్ బెజ్జంకి : శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందే కొద్ది సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుంటు ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించుట కోసం బెజ్జంకి పోలీస్ సిబ్బంది మండలంలోని బేగంపేట గ్రామంలో శనివారం పోలీసు కళాబృందం చే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాబృందం వారు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు వివరించారు, సామాజిక మాధ్యమాలలో లింకులను పంపుతూ బ్యాంకు ఖాతాలోని డబ్బులను సైబర్ నేరగాళ్లు కాగేస్తున్నారని, ఇలా డబ్బులు పోగొట్టుకున్నప్పుడు ప్రజలు 1930 నంబర్ కి 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం ఉందని సూచించారు.బీమా డబ్బులు వచ్చాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని రకరకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే గంజాయి క్రోకైన్ మొదలగు వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ సిబ్బంది స్థానిక ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై పోలీసుల కళాబృందం
- Advertisment -