కరీంనగర్, జనతా న్యూస్:లోకసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల జాబితా వెలువడినందున ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా డబ్బు, మద్యం , ఇతర వస్తువులు రవాణా చేసే చర్యలు అడ్డుకట్ట వేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు కమీషనరేట్ వ్యాప్తంగా కరీంనగర్ వన్ టౌన్ , టూ టౌన్ , త్రీ టౌన్ పరిధిల్లోని బస్ స్టాండ్ ఏరియా, నాఖా చౌరస్తా , గీతాభవన్ తో పాటుగా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలతోపాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని , ఉల్లంఘించి పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు..
- Advertisment -