వరంగల్, జనతా న్యూస్: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నెల 12వ తేదిన నుండి 16వ తేదివరకు నిర్వహించిన 12వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో సైటిఫిక్ ఎయిడ్స్ టూ ఇన్వెష్టిగేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో స్వర్ణపతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎస్.ఐ విజయ్‌కుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సత్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పతకాన్ని గెలిచిన ఎస్.ఐ విజయ్‌కుమార్‌కు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పోలీస్ డ్యూటీ మీట్ల ద్వారా పోలీస్ అధికారులు పోలీస్ విధుల్లో మరింత రాణించేందుకు దోహడపడుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.
ఎస్ ఐకి పోలీస్ కమిషనర్ సన్మానం
- Advertisment -