కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో సోమవారం పోచమ్మ తల్లి బోనాల వేడుక వైభవంగా సాగింది. ఈ వేడుకకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ తల్లి చల్లని చూపు, దయ ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు జీవిం చాలని అమ్మవారిని ప్రార్థించినట్లు బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్,గాండ్ల శ్రీనివాస్ తీగల గుట్టపల్లి ప్రజలు , మహిళలు పాల్గొన్నారు.
తీగలగుట్టపల్లి లో ఘనంగా పోచమ్మ బోనాలు
- Advertisment -